ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి

మంత్రి అనిత

పాయకరావుపేట,ఆంధ్రప్రభ: అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసాను అందిస్తుందని మంత్రి అనిత అన్నారు. ఈ మేరకు పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 31,51,284 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సాయం అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.