తెలంగాణకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు జయశంకర్
మక్తల్, ఆంధ్రప్రభ: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, మలిదశ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తిగా జయశంకర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సేవలు చిరస్మరణీయమని, సబ్బండ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహగౌడ్, బీఆర్ఎస్ నాయకులు చిన్న హన్మంతు, మహిపాల్‌రెడ్డి, జుట్ల శంకర్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, కుమ్మరి రవికుమార్, ఈశ్వర్ యాదవ్, గార్లపల్లి నర్సింహారెడ్డి, నేతాజీ రెడ్డి, ఎలిగండ్ల బాలప్ప, కర్రెం అంజి, జె. సాగర్ తదితరులు పాల్గొన్నారు.
