గోదావరిఖని సింగరేణి జిఎం కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయంతి వేడుకలు

ఆచార్య చిత్రపటానికి జీఎం లలిత్ కుమార్ నివాళులు

గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ కృషి చేరాస్మరణీయమని రామగుండం ఏరియా సీనియర్ లలిత్ కుమార్ అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు గోదావరిఖని సింగరేణి జిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆచార్య చిత్రపటానికి జీఎం లలిత్ కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడని చెప్పారు. జయశంకర్ ఆశయాలు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు.


1969 ఉద్యమం, 2009 ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారని, కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతిగా పనిచేస్తూ, విద్యా సంస్కరణల్లో కూడా కృషి చేశారని పేర్కొన్నారు. జయశంకర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శమని…సింగరేణి ఉద్యోగులు కూడా ఆయన స్ఫూర్తితో సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని జిఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు. జి.ఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సి.ఎం.ఓ.ఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, ఏఐటియుసి జి.ఎం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, డిజియం ఫైనాన్స్ ధనలక్ష్మి భాయి, సీనియర్ పి.ఓ హనుమంత రావు, అధికారులు వేణు, వీరారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.