Sensex | ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు..
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, దేశీయంగా కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఫ్లాట్గా కదులుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతుండగా, పెట్టుబడిదారులు కీలక ఆర్థిక పరిణామాలపై దృష్టి సారించారు.
ఈ ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 78,774 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 24,645 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ ఇండెక్స్ 99.66 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.2 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.61 శాతానికి చేరింది. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు అమెరికా మార్కెట్లలో గత సెషన్లో స్వల్ప ఒత్తిడి కనిపించింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.17 శాతం తగ్గగా, నాస్డాక్ 0.83 శాతం నష్టంతో ముగిసింది. అయినప్పటికీ దేశీయ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమవడం పెట్టుబడిదారుల్లో ఆశావహ వాతావరణాన్ని నెలకొల్పింది.
