BIG BREAKING | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
- నీట్ లీక్ కేసులో కీలక మలుపు..
- దర్యాప్తు వేగం..
- 13 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
- 92 చోట్ల సోదాలు..
- నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు..
- డిజిటల్ ఆధారాల స్వాధీనం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయస్థానంలో 13 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఛార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉన్నట్టు సీబీఐ తెలిపింది. దర్యాప్తులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా, నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఫ్రీజ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే అదనపు ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి.
