Allu Arjun | ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా అయిన అల్లు అర్జున్
సామాజిక మాధ్యమంలో భావోద్వేగ పోస్ట్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అభిమానులతో అనుబంధానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన అభిమానులను ప్రత్యేకంగా కలిశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులతో దాదాపు ఆరు గంటల పాటు గడిపి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగుతూ, వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన అల్లు అర్జున్ వారి ప్రేమ, ఆదరణ తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అభిమానులు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మరువలేనిదని, వారి అంచనాలకు తగ్గట్టుగా మరింత మంచి సినిమాలతో అలరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ప్రేమకు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పంచుకున్నారు.
అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోను పంచుకున్న అల్లు అర్జున్, “My Dear Fansss… Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled. Hope to make you all more mad proud.” అంటూ పోస్టు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం తనను ఎంతో కదిలించిందని, వారి ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంచి సినిమాలతో అభిమానులను గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చారు.
అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ బన్నీపై తమ అభిమానాన్ని కామెంట్లు, షేర్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ఆయన దిగిన సెల్ఫీ కూడా నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది.
