ఏలూరులో లంకా దినకర్ పర్యటన!

ఇరవై సూత్రాల అమలుపై అధికారులతో కీలక సమీక్ష

ఏలూరు, ఆంధ్రప్రభ: ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్–స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో ఆయనకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లంకా దినకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి. సందీప్ రెడ్డి తదితరులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం జిల్లాలో అమలవుతున్న ఇరవై సూత్రాల కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.