గాంధారి ఏఎంసీలో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.58 లక్షలతో ప్రహరీ గోడ, మౌలిక వసతుల కల్పన

గాంధారి, ఆంధ్రప్రభ: గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆవరణలో మంగళవారం అభివృద్ధి పనులను ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి రూ.58 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

మంజూరైన నిధులతో ఏఎంసీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్, సింగిల్ విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్, మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ముకుందరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బిస గణేష్, తరుణ్, నాయకులు తాటి సురేష్, గడ శంకర్, సంఘని బాలయ్య, రమేష్ పటేల్, ఈశ్వర్ గౌడ్, బొమ్మని బాలు, సంఘని బాబా, వడ్ల బాలరాజ్, మోహన్ నాయక్, భాగ్య నాయక్, సంఘ గౌడ్, బొట్టు మూతిరామ్, నీల రవి, మధు తదితరులు పాల్గొన్నారు.