Peddi Sudarshan Reddy Health | పెద్ది స్వప్న రెడ్డిని పరామర్శించిన తాటి వెంకటేశ్వర్లు

Peddi Sudarshan Reddy Health | సికింద్రాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వెళ్లిన ఆయన, పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పెద్ది స్వప్న రెడ్డికి మనోధైర్యం కల్పించిన తాటి వెంకటేశ్వర్లు, భగవంతుని కృపతో పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైటి రాజేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.