Jaipal Reddy Death Anniversary | రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన మహానేతగా ప్రశంసలు

Jaipal Reddy Death Anniversary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జైపాల్ రెడ్డి చివరి శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా జీవితాన్ని కొనసాగించారని అన్నారు. తన అపార విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో ప్రజల హృదయాల్లోనే కాకుండా పార్లమెంట్‌లోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, ఆదర్శాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.