కూలికి వెళ్తున్న వృద్ధురాలికి ప్రమాదం

డోర్నకల్, ఆంధ్రప్రభ: డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామ శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన దాసరి పిచ్చమ్మ (60) కూలి పనులకు వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మల్లయ్యకుంట తండాకు చెందిన ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రురాలిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.