కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి

  • ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి

భీమవరం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో నియోజక వర్గంలో రూ.2264.47 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. సోమవారం పట్టణంలోని 6 వార్డు బొక్కవారిపాలెం నుండి ఎన్డీఏ కూటమి రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి సంక్షేమం, అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గత వైసీపీ పాలన వల్ల గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో అనేక పరిశ్రమలు, వ్యాపార పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా అనేక నూతన పథకాలను కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.

మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, పిల్లల చదువులకు తల్లికి వందనం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ శ్రీశక్తిని బలోపేతం చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గ పరిశీలకులు చెరుకూరి సాయిరాం, టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ 45 రోజుల పాటు కూటమి ప్రభుత్వ విజయాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని క్లస్టర్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు వివిధ కమిటీల నాయకులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.