మంత్రి పొన్నంను కలిసిన టీఎన్‌జీఓ నేత

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : టీఎన్‌జీవోస్ పెద్దపల్లి అర్బన్ జెంట్స్ కార్యదర్శిగా ఎన్నికైన గాండ్ల రమేష్ పటేల్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై త్వరగా స్పందించి పరిష్కరించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రమేష్ తెలిపారు.

తనను అర్బన్ జెంట్స్ కార్యదర్శిగా ఎన్నుకున్న తోటి ఉద్యోగులతో పాటు టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరు శంకర్, నాయకులు సందీప్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, సహకరించిన ప్రతి ఒక్కరికీ గాండ్ల రమేష్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.