పెద్ది ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

హనుమకొండ, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.

పెద్ది ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు ఎయిమ్స్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. పెద్ది త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.