28న సీఎంతో ముఖాముఖికీ..

  • మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం..
  • ఫిన్లాండ్ విద్యా విధానంపై చ‌ర్చ‌

జన్నారం, ఆంధ్రప్రభ: ఫిన్లాండ్ విద్యా విధానంపై మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు ఈనెల 28న రాష్ట్ర సీఎంతో ముఖాముఖి హైదరాబాడ్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ముఖాముఖికి మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్,పొనకల్ గ్రామపంచాయతీలోని అక్కపల్లిగూడ మండల పరిషత్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల హెచ్.ఎం జాజాల శ్రీనివాస్ లు హాజరుకానున్నారు.అక్కడి విద్యా విధానంపై సీఎం అభిప్రాయ సేకరణ చేయనున్నారు.ఈ మేరకు ఆహ్వాన పత్రం అందినట్లు వారు సోమవారం ఉదయం తెలిపారు.ఈ సందర్భంగా ఆ ఉపాధ్యాయులను స్థానిక ఎంఈఓ బానావత్ రాజేందర్, ఇతరులు అభినందించారు.