ట్రినిటీలో పలు కోర్సుల అనుమతి.
జెఎన్ టీ యు 2వ విడత కౌన్సెలింగ్.
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పలు కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతి లభించిందని ట్రినిటీ విద్యాసంస్థలు ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా బీటెక్ సిఎస్సి(ఐఓటి) బీటెక్ సిఎస్సి (డాటా సైన్స్) కోర్సులు రెండో విడత కౌన్సిలింగ్ కు అనుమతి లభించింది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలను మొదటి ఆప్షన్ గా ఎంచుకోవాలని కోరారు. ఈ కళాశాల ప్రతిష్టాత్మకమైన అటానమస్, నాక్ అక్రిడేషన్ పొంది, కేంద్ర ప్రభుత్వంచే ఆమోదం పొందిన ఎంఎస్ఎమ్ఈ ఇంక్యుబేషన్ సెంటర్ కలిగిన కళాశాల అని అన్నారు.
ఈనెల 18 నుండి 2వ విడత కౌన్సెలింగ్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా అనుమతి పత్రాలు శనివారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్, ఏవో సురేష్, రాజిరెడ్డి, చొప్పరి వంశీ, విభాగాధిపతులు డాక్టర్ ఆరిఫ్, ప్రభాకర్, స్వాతి, లక్ష్మి, పద్మిని, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
