బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా!

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ, గ్రామ భద్రత కోసం 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో అత్యంత చొరవ చూపి, కీలక పాత్ర పోషించిన పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను డీసీపీ ఎగ్గడి భాస్కర్ అభినందించి, ఘనంగా సత్కరించారు.