పవన్ ఆరోగ్యంపై ఆరా తీసిన ఉప సభాపతి, ప్రజాప్రతినిధులు
అమరావతి, ఆంధ్రప్రభ: కుడి భుజానికి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను శుక్రవారం సాయంత్రం పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, న్యాయవాదులు, మీడియా సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ వెంకటేశ్వరరావు తదితరులు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

