శ్రీ పెద్దమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.1,01,016 విరాళం

సదాశివనగర్ (ఆంధ్రప్రభ): మండల కేంద్రంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి సదాశివనగర్ గ్రామానికి చెందిన పోలాబోయిన స్వప్న–బాలగంగారం దంపతులు గురువారం రూ.1,01,016 విరాళాన్ని అందజేశారు. ఆలయంలో ప్రతిష్ఠించనున్న శ్రీ కృష్ణార్జున రథం నిర్మాణానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి కోసం భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు పోలాబోయిన పెంటవ్వ, పోలాబోయిన అనిత–రాములు, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.