Kirlampudi | ముద్రగడ అంత్యక్రియల ఘటనలో…
Kirlampudi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అంత్యక్రియల సమయంలో పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తుండగా అంబటి రాంబాబు, ఆయన అనుచరులు పోలీసులను తోసివేశారని ఆరోపణలున్నాయి.
ఈ ఘటనపై ఏఆర్ ఎస్‌ఐ అప్పలరాజు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే తమను తోసివేసి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
