చెన్నూరు మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

చెన్నూరు (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా అల్లే మారుతి ప్రసాద్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

పరిపాలనా బదిలీల్లో భాగంగా మారుతి ప్రసాద్‌ను చెన్నూరు మున్సిపాలిటీకి బదిలీ చేయగా, చెన్నూరులో కమిషనర్‌గా పనిచేసిన మురళీకృష్ణను క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.