argentina-beat-england-2-1.. మెస్పీ గ్యాంగ్ మెర్సిలెస్ ..

argentina-beat-england-2-1.. మెస్పీ గ్యాంగ్ మెర్సిలెస్ ..

  • ఇంగ్లండ్ పై ప్ర‌తీకార విజ‌యం
  • ఫైన‌ల్ కు అర్జెంటీనా
  • 2-1 తేడాతో ఇంగ్లండ్ పై ఘ‌న విజ‌యం
  • 30న స్పెయిన్ తో ఫైన‌ల్ ఫైట్

(ఆంధ్రప్ర‌భ‌, క్రీడాప్ర‌తినిధి )
argentina-beat-england-2-1.. అంద‌రూ ఊహించిన‌ట్టే ఫిఫా టోర్నీ డిఫం డింగ్​ చాంపియన్​ అర్జెంటీనా ఫైన‌ల్ కు దూసుకు పోయింది. ఆఖ‌రి నిముషంలో ఇంగ్లండు జ‌ట్టు ఆశ‌ల్ని మెస్పీ గ్యాంగ్ నిర్ధాక్ష‌ణ్యంగా ఓడించింది. ఒకానొక ద‌శ‌లో అర్జెంటీనా.. ఈ మ్యాచ్‌లో ఓడ‌టం ఖాయం అని సాక‌ర్ వీరులు టెన్ష‌న్ ప‌డ్డారు. కానీ ఆఖ‌రి అద‌న‌పు నిముషంలో 2-1 తేడాతో ఇంగ్లాండుకు జెల్ల‌కొట్టింది. అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి అర్థ భాగంలో ఇంగ్లండ్ టీమ్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఒక వైపు అర్జెండీనా కాళ్ల‌కు క‌ళ్లెం వేస్తూ.. మ‌రో వైపు గోల్ పోస్టు వైపు బంతిని త‌ర‌లించారు. రెండు సార్లు ఫ్రీ కిక్
చాన్స్ వ‌చ్చినా మెస్పీ గ్యాంగ్ మెర్సిలెస్ గా ఇంగ్లండ్‌ను అడ్డుకున్నారు. ఇకమైఆదానంలో బంతి ఆ చిర‌వ నుంచి ఈ చివ‌ర‌కు ప‌రుగులు పెట్టిందే గానీ గోల్ పోస్టు దాట‌లేదు. 1970, 1990 నాటి ఫుట్ బాల్ గేమ్ క‌నిపించిది. ఆ చీక‌టి రోజుల్ని గుర్తు చేసింది. ఇలా ఆరంభం నుండి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సగంలో రెండు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోవడంతో స్కోరు 0-0 గా నిలిచింది.రెండో సగం మ్యాచ్ 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆంథోనీ గోర్డాన్ అద్భుత గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.అనంతరం ఇక అర్జెంటీనా పూర్తిగా ఎటాకింగ‌గ్ వ్యూహంలోకి వ‌చ్చేసింది. డూ ఆర్ డై రీతిలో గట్టిగా పోరాడింది. 85వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్ చేసి స్కోరును 1-1 తో సమం చేశాడు.మ్యాచ్ ముగుస్తుందనగా ఇంజూరీ టైమ్ (90+2వ నిమిషంలో) అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లౌతారో మార్టినెజ్ నిర్ణయాత్మక గోల్ కొట్టి అర్జెంటీనాకు 2-1 తో విజయాన్ని ఖరారు చేశాడు.తదుపరి మ్యాచ్‌లు (ఫైనల్ షెడ్యూల్):తొలి సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 2-0 తో ఓడించిన స్పెయిన్ జట్టుతో, జూలై 20న (భారత కాలమానం ప్రకారం) న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే మహా సంగ్రామం (ఫైనల్) లో అర్జెంటీనా తలపడనుంది. ఓడిపోయిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు జూలై 19న మూడో స్థానం కోసం పోటీ పడతాయి