లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు నిధులు కేటాయిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పారేవుల శంకర లింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పారేవుల విష్ణువర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు నిధులు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని ప్రతినిధులు కోరగా, అవసరమైన నిధులు విడుదల చేయించి మరమ్మతులు పూర్తి చేసి సాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్షుడు ఎం. గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేష్, మాజీ సర్పంచ్ మనీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.