NEWS@10:00 A.M | 15 జూలై 2026 ముఖ్యాంశాలు

దేశంలోనే తొలి గ్రీన్ సిమెంట్ విప్లవం.. కడపలో రూ.3,100 కోట్ల దాల్మియా విస్తరణకు శ్రీకారం

కడప, ఆంధ్రప్రభ బ్యూరో: రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి కడప జిల్లా వేదిక కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలోని దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో దశ విస్తరణ పనులకు బుధవారం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలకు పెద్దపీట

ఆంధ్రప్రభ న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి, హైదరాబాద్: సిరుల మాగాణిగా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగుతో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. సంప్రదాయ వరి సాగుతో నిండా మునుగుతున్న రైతన్నలను ఆదుకోవడంతో పాటుప్రత్యామ్నాయ వాణిజ్య, ఆరుతడి పంటలవైపు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

FIFA World Cup 2026 | అజేయ ప్రదర్శన.. ఫైనల్ కు దూసుకెళ్లిన స్పెయిన్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో కనబరచిని అజేయ ప్రదర్శన సెమిస్ లోనూ ప్రదర్శించి ఫైనల్ కు అర్హత సాధించింది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే బంతిపై ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్, 22వ నిమిషంలో మికెల్ ఒయార్జబాల్ పెనాల్టీ ద్వారా తొలి గోల్ నమోదు చేసింది. 

ఎల్‌నినో ప్రభావం: తగ్గే వర్షాలు.. పెరుగుతున్న ప్రమాదం

వాతావరణ మార్పులు ఇప్పుడు భవిష్యత్ ప్రమాదం కాదు.. వర్తమాన వాస్తవం. ఒకప్పుడు ఋతువులు సమయానికి వచ్చేవి. వర్షాలు ఒక క్రమంలో కురిసేవి. రైతులు వాటిని ఆధారంగా చేసుకుని సాగు ప్రణాళికలు రూపొందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. వర్షాలు ఆలస్యంగా వస్తున్నాయి. వచ్చినా ఒకేసారి కుండపోతగా కురిసి వరదలు సృష్టిస్తున్నాయి. తర్వాత మళ్లీ దీర్ఘకాలం పొడి వాతావరణం నెలకొంటోంది. ఈ అసాధారణ పరిస్థితులకు ప్రధాన కారణాల్లో ఒకటి ఎల్‌నినో ప్రభావం.

ఆత్మగౌరవానికి ప్రతీకగా ముద్రగడ పద్మనాభం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేక అధ్యాయానికి నాయకత్వం వహించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన అరుదైన వ్యక్తిత్వానికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సమకాలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన వైఖరి పూర్తి భిన్నం. ఆలోచనల్లో స్పష్టత ఆయన సొంతం. అనుకున్నది సాధించేందుకు ఎవరినైనా ఎదిరించే తత్వం. ఎంతటి నష్టానికైనా ఓర్చే గుణం ఆయన నైజం. ఆత్మగౌరవానికి అసలు, సిసలైన ప్రతీక పద్మనాభం. 

సనాతన ధర్మం.. అన్ని మతాల పట్ల గౌరవ భావన

నా ధర్మం సనాతన ధర్మం. నా మతం హిందూ మతం! అయినంత మాత్రాన నా స్వధర్మం నేను మరిచి పోను! అన్ని మతాలనూ, అన్ని ధర్మాలనూ గౌరవంగాఆదరించటమే నా స్వీయ ధర్మం! ఇతర ధర్మాల వారితో నా స్నేహం ఎన్నడూ చెడిపోలేదు! ఎందుకంటే వారూ నేనూ కావాలని ఎప్పుడూ కనపడని లక్ష్మణ రేఖలు విషయాలల్లో దాటటానికి ప్రయత్నించలేదు!

Click here to read the full stories