Mudragada Padmanabham | ముద్రగడ మృతి తీవ్రంగా కలచివేసింది – వైఎస్‌ జగన్

అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ముద్రగడ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. పదవుల కంటే ప్రజలనే గొప్పగా భావించి, పేదల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు.

కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన ముద్రగడ.. ఆత్మగౌరవం, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని జగన్ అన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అభిమానులకు తీరని లోటని పేర్కొంటూ సంతాపం తెలిపారు.