ప్రోటోకాల్ రగడ
- దళితుడనని అవమానపరిచారని ఆందోళన
- రసాభాసగా మారిన ప్రాంగణం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: తాండూరు మండల కేంద్రంలో బీసీ కమ్యూనిటీ హాల్ లో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సమావేశం రసాభాసగా మారింది. తాను దళితుడనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమావేశానికి పిలవకుండా ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టకుండా అవమానపరిచారని తాండూర్ సర్పంచ్ ముడిమడుగుల సురేష్ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దబోయిన శంకర్ లను నిలదీశారు.
బీఎల్ఏల సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని, సభా ప్రాంగణం పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదని ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు బీఎల్ఏల సమావేశం గందరగోళంగా మారింది. సభ వేదికపై ఉన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ తంతు అరగంట పాటు మౌనం వహించారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన తనకు ప్రజలు జిల్లాలనే అత్యధిక ఓట్లు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఇదేనా మీరు చేసే న్యాయం ఇదేనా దళితుడనని చిన్న చూస్తూ అవమానపరిచారని సభ వేదికపై ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా మండలంలో మాదారం 3 ఇంక్లైన్ , కిష్టంపేట బోయపల్లి కాజీపేట, కొత్తపల్లి తదితర గ్రామపంచాయతీల సర్పంచులకు బీఎల్ఏల సమావేశం సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ దాదాపు 200 మందికి పైగా ఉన్న కార్యకర్తలతో అనుచరులతో కలిసి సురేష్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్రవర్ణాల వ్యక్తి కావడంతో దళితులను చిన్నచూపు చూస్తున్నాం అనేది తన ఘటన నిదర్శనమని పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ డీసీసీ అధ్యక్షుడు మండలం లో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఇది పార్టీ మీటింగ్ ప్రోటోకాల్ ఉండదు ..
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఎల్ఏల సమావేశమని ప్రోటోకాల్ ఉండదని సమావేశంలో పేర్కొన్నారు. దీంతో కంగు తిన్న సర్పంచ్ సురేష్ సమావేశాన్ని వారించి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో సమావేశానికి వచ్చిన బీఎల్ఏల ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
అనుమతి లేదు.. పోటోలు తీయొద్దు..
సమావేశం కవరేజ్ కి వచ్చిన పాత్రికేయులు గొడవను చిత్రీకరిస్తుండగా మీడియాకు అనుమతి లేదు ఎందుకు వచ్చారంటూ డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి పాత్రికేయులను ఎదురు ప్రశ్నించడం పలు విమర్శలకు తావిస్తోంది.
