రహత్ నగర్ నూతన సబ్‌స్టేషన్ పనులు వేగవంతం..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పీసీసీ చీఫ్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మండలంలోని రహత్ నగర్ గ్రామంలో నిర్మిస్తున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పీటింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లకావత్ తిరుపతి మాట్లాడుతూ, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రజాప్రతినిధుల సమక్షంలో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో రహత్ నగర్‌తో పాటు పరిసర గ్రామాల విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, తక్కువ వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ ఏడీఈ శ్రావణ్ కుమార్, కన్స్ట్రక్షన్ ఏఈ సాయిలు, ట్రాన్స్‌ఫార్మర్ ఏఈ, లైన్‌మన్ మోహన్, స్థానిక సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ భుక్య సేవలాల్, వీడీసీ సభ్యుడు బాదావత్ గోపాల్, రాములు, గ్రామ పెద్దలు బాదావత్ బాలు, శర్మ నాయక్, మోహన్ నాయక్, రాములు, రమేష్, కాంట్రాక్టర్ సతీష్ రావు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
