రాష్ట్ర అథ్లెటిక్స్‌కు టీజీ మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
చిట్యాల, ఆంధ్రప్రభ : మెదక్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చిట్యాల మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్ విద్యార్థులు వివిధ రన్నింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ మంగళవారం తెలిపారు.
ఎంపికైన విద్యార్థులు:
- అండర్-14: కె. వీరేంద్ర చారి (6వ తరగతి) – 60 మీటర్ల పరుగుపందెం
- అండర్-16: బి. భార్గవ్ తేజ (9వ తరగతి) – 2000 మీటర్ల పరుగుపందెం
- అండర్-18: ఎన్. శ్రీశేషు (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) – 2000 మీటర్ల పరుగుపందెం
- అండర్-18: డి. ప్రణయ్ (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) – 2000 మీటర్ల పరుగుపందెం
- అండర్-20: యు. అశోక్ (పీడీ) – 1600 మీటర్ల పరుగుపందెం
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విద్యార్థుల కృషికి నిదర్శనమన్నారు. ఎంపికైన విద్యార్థులు, వారికి శిక్షణ అందించిన శారీరక విద్య ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
