ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు జులై 24 వరకు పొడిగింపు

అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈసీ నిర్ణయం..

జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువును జులై 24 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ మంగళవారంతో ముగియాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఈ నెల 24 వరకు కొనసాగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

షెడ్యూల్ ప్రకారం జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.