20న తొలి దశ ఉద్యమనేత వర్ధంతి వేడుకలు..
- వర్ధంతి పోస్టల్ విడుదల చేసిన నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : తొలి తరంఆదివాసి ఉద్యమ నేత తుడుం దెబ్బ వ్యవస్థాపకులు స్వర్గీయ సీడం శంభు ఎనిమిదవ వర్ధంతి ఈనెల 20న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడి గూడ లో నిర్వహించడం జరుగుతుందని ఉట్నూర్ మండల మాజీ ఎంపీపీ పంద్ర జైవంతరావు, నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూర్ ప్రెస్ భవన్లో స్వర్గీయ తొలి తరం ఉద్యమ నేత సీడం శంభు ఎనిమిదవ వర్ధంతి వేడుకల పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్రజయవంత రావు, సోనే రావు పటేల్, మత్తడిగూడ సార్ మేడి నైతం చిత్రపటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా, అటవీ హక్కుల ఉద్యమ కెరటంగా నిలిచి ఆదివాసీల చట్టాలను కాపాడటంలో శంభు పటేల్ చేసినకృషిఅభినందనీయమన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన యోధుడికి ఘనంగానివాళులర్పించనున్నట్లు తెలిపారు.ఈ నెల 20న ఉదయం 10 గంటలకు సిడాం శంభు పటేల్ వర్ధంతి నిర్వహణ కమిటీ, గోండ్వానా పంచాయితీ రాయ్సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభజరుగుతుందని వారు తెలిపారు. ఈ స్మారక సభకు ఆదివాసీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లచ్చు పటేల్, అత్రం భీంరావ్, పంద్ర జాలింషా, మాణిక్ రావు, వినాయక్ రావు, భీమ్ రావు, మల్కు, రామేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
