ఏబీవీపీ పిలుపుతో విజయవంతమైన కళాశాలల బంద్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలల బంద్ విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నగర అధ్యక్షుడు శివశంకర్, ఉపాధ్యక్షులు ఆకాష్, నవీన్ మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చరణ్, సోషల్ మీడియా ఇన్చార్జి అరవింద్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
