కాలువలో మృతదేహం కలకలం..
- కేసు నమోదు చేసిన పోలీసులు
బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్(బి) శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) వరద కాలువ వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, బట్టతలతో ఉన్నాడని పేర్కొన్నారు. అతని జేబులో అంబర్ పాన్ మసాలా ప్యాకెట్ లభ్యమైనట్లు తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాల్కొండ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
