Ap-Cm-Angry : అంతా గొడ్డలి పార్టీదే..! Andhra Prabha Top News
Ap-Cm-Angry : అంతా గొడ్డలి పార్టీదే..! Andhra Prabha Top News
- పవన్ కుటుంబంపై అసభ్య పోస్టులా..?
- గంజాయి బ్యాచ్‌కు సపోర్ట్..?
- పవన్ కళ్యాణ్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచన.
- పోలవరం ప్రాజెక్టు పనులు 89 శాతం పూర్తయ్యాయని వెల్లడి.
- కోనసీమలో టూరిజం, రైల్వే, గోదావరి డెల్టా ఆధునికీకరణకు హామీ.
- ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ నిధులు జమ చేస్తామని ప్రకటన.
- కోనసీమలో సీఎం సంచలన వ్యాఖ్యలు..!
( ఆంధ్రప్రభ, పిచ్చుకలంక )

నాకు రౌడీలతో, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు… కానీ ఇప్పుడు గొడ్డలి పార్టీతోనే సమస్య వస్తోంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు… ఆడవాళ్లని అసభ్యంగా మాట్లాడే వారిని గొడ్డలి పార్టీ సమర్థిస్తోంది.సోషల్ మీడియా వాళ్లకు గొడ్డలి పార్టీ నేతలు ఫైనాన్స్ చేస్తున్నారు.. స్టూడియోలు పెట్టిస్తున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లకు గొడ్డలి పార్టీ సపోర్ట్ చేస్తోంది.. వారికి డబ్బులిచ్చి ప్రొత్సహిస్తోంది. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 కొత్తగేట్ల ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆశిష్కరించారు. అనంతరం పిచ్చుకులంకలో కొత్తపేట నియోజకవర్గం రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర మాట్లాడెతూచ గత పాలకులు గంజాయిని ప్రొత్సహించారు. గంజాయిని ప్రొత్సహించే వారిని అదుపులోకి తీసుకుంటాం. గంజాయి మత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది, అని సీఎం హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఇబ్బందులు సృష్టించేందుకు కులాలు, మతాల మధ్య కొందరు చిచ్చు పెడుతున్నారు. మంచి చేస్తే ఆదరించే స్వభావం గోదావరి ప్రజల సొంతం. 1999లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 21 స్థానాలకు గానూ 20 స్థానాలను గెలిపించారు. 2024 ఎన్నికల్లో అదిరే మెజార్టీలు ఇచ్చారు.. కూటమి మీద గోదావరి జిల్లాల వారికి ఉండే అభిమానం ఇది అని సీఎం వివరించారు.
Ap-Cm-Angry : విధ్వంసం నుంచి వికాసం వైపు

టీడీపీ-జనసేన-బీజేపీ మూడు పార్టీలు రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తున్నాయి.
ప్రధాని మోదీ-నేను-పవన్ కళ్యాణ్ నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం… చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధ్వంసాన్ని గత ప్రభుత్వం చేసింది. వాటిని సరి చేస్తున్నాం… పరిశ్రమలు తెస్తున్నాం.. రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి… ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి కరుణతో మరింత అభివృద్ధి చేస్తాం. విధంగా సంక్షేమం అందిస్తున్నాం. మోదీ-నేను-పవన్ ఆలోచన లక్ష్యం అభివృద్ధి-సంక్షేమమే. అని సీఎం స్పష్టం చేశారు.
Ap-Cm-Angry : పవన్ కళ్యాణ్ కు విశ్రాంతి అవసరం

పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువ… జనంలోకి వచ్చిన కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు .భుజం నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించాను. పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా జనంలోకి వస్తానని డిప్యూటీ సీఎం అంటున్నారు. విశ్రాంతి తీసుకోమని చెప్పాను… ఆరోగ్యం బాగుంటే మరింత బాగా ప్రజల కోసం పని చేయవచ్చని సూచించాను. అని సీఎం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇంటింటికి కుళాయి ద్వారా నీరును అందించే పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కట్టాల్సిన పంటల బీమాను గత ప్రభుత్వం కట్టలేదు. ఎల్ నినో వల్ల వాతావరణ మార్పులు వస్తున్నాయి… 25 శాతం వర్షపాతం తక్కువ పడింది… నదుల్లోకి నీళ్లు రావడం లేదు. వాతావరణ పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని దానికి అనుగణంగా వ్యవహరించాలి. పిచ్చుక లంక, బొజ్జర్లంక ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. గోదావరి డెల్టా ఆధునికీకరణ చేపడతాం… చివరి భూములకు నీళ్లందిస్తాం… కోనసీమకు రైల్వే లైన్ వచ్చేలా చేస్తాం, అని సీఎం హామీ ఇచ్చారు.
Ap-Cm-Angry : ఈ నెలలో తల్లికి వందనం వేస్తాం

ఈ నెలలో తల్లికి వందనం కింద డబ్బులు జమ చేస్తాం… ప్రతి నెలా పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నాం… అన్నదాత సుఖీభవ నిధులను రైతులకిచ్చాం. పోలవరం డయా ఫ్రం వాల్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం గోదావరి పాలు చేశారు. 2014-19 మధ్య కాలంలో 72 శాతం మేర పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. గత ప్రభుత్వం కేవలం 2 శాతం పనులు మాత్రమే చేపట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 89 శాతం మేర పనులను పూర్తి చేశాం.పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం.. వారికి ఆనందం కలిగిస్తాం. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తాం. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం.గడచిన 2 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు పెట్టాం. తుంగభద్ర డ్యాంకు 36 కొత్త గేట్లు బిగించాం.. పట్టిసీమ వల్ల జీవితాలు మారాయ, అని సీఎం స్పష్టం చేశౄరు. .
Ap-Cm-Angry : అత్యంత వైభవంగా పుష్కరాలు

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. నదులను పూజించడం.. ప్రకృతి అనుసంధానం కావడం మన వారసత్వం.. సంస్కృతి. పుష్కర ఘాట్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తాం. గోదావరి జిల్లాల్లో చేపలకు మంచి ధర లభిస్తుంది.. ఆక్వా రైతులకు రూ. 1.50కే విద్యుత్ అందిస్తున్నాం. గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో పామాయిల్ వేస్తున్నారు… కోకో పంటల ద్వారా ఆదాయం పొందుతున్నారు.కోవూరులో త్వరలోనే కోకో సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. గోదావరి పుష్కరాల నిమిత్తం రాజమండ్రిలోనే రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం, అని సీఎం వివరించారు.
