మండల వ్యవసాయ అధికారి బాధ్యతలు స్వీకరణ..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల వ్యవసాయ అధికారిగా సొదారి వీరన్న సోమవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా దండేపల్లి మండల వ్యవసాయశాఖ అధికారి గొర్ల అంజిత్ కుమార్ జన్నారం ఇన్చార్జి అధికారిగా వ్యవహరించారు.
అతని స్థానంలో జిల్లాలోని వేమనపల్లి వ్యవసాయ శాఖ అధికారి వీరన్న మంచిర్యాల ఏడీఏ ఎం. కృష్ణ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
