రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్
జైనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ సూచించారు.
సోమవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
