Bigg Boss Telugu 10 Contestants: Kavya Sri Entry Rumours, Dasavataram Theme, Agnipariksha 2 Auditions: ఈ సారైనా వస్తుందా… ఆ క్రేజీ బ్యూటీ? బిగ్‌బాస్ 10లో ఎంట్రీ ఖాయమా!

Bigg Boss Telugu 10 Contestants: Kavya Sri Entry Rumours, Dasavataram Theme, Agnipariksha 2 Auditions: ఈ సారైనా వస్తుందా… ఆ క్రేజీ బ్యూటీ? బిగ్‌బాస్ 10లో ఎంట్రీ ఖాయమా!

అప్పుడేమో ప్రియుడు… ఇప్పుడేమో ప్రియురాలు!
బిగ్‌బాస్ 10లో హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ
అడిగినంత రెమ్యూనరేషన్… అయినా ఓకే!
బిగ్‌బాస్ కోసం నిర్వాహకుల భారీ ప్రయత్నాలు
దశావతారం థీమ్‌తో బిగ్‌బాస్ 10…
హౌస్‌లోకి అడుగుపెట్టేది ఈ క్రేజీ బ్యూటీయేనా?
బిగ్‌బాస్ 10లో సంచలనం ఖాయమా?
బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టే వారి పేర్లుపై జోరుగా ప్ర‌చారం

Bigg Boss Telugu 10 Contestants: Kavya Sri Entry Rumours, Dasavataram Theme, Agnipariksha 2 Auditions | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, సినిమా ప్ర‌తినిధి : బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష-2’ ఆడిషన్లు కొనసాగుతుండగా, సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల పేర్లపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే స్టార్ మా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

మరోసారి హోస్ట్‌గా నాగార్జున.. ఎప్పుడు ప్రారంభం?


సీజన్-3 నుంచి విజయవంతంగా హోస్ట్‌గా కొనసాగుతున్న కింగ్ అక్కినేని నాగార్జునే ఈసారి కూడా షోను నడిపించనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 2026 ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

దశావతారం థీమ్‌తో గ్రాండ్ ప్లాన్

ల్యాండ్‌మార్క్ పదో సీజన్ కావడంతో ఈసారి షోను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘దశావతారం’ థీమ్‌తో హౌస్ డిజైన్, గేమ్స్, టాస్కులు, ఎలిమినేషన్ విధానంలో కూడా కొత్త మార్పులు ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రచారంలోకి వచ్చిన కంటెస్టెంట్ల పేర్లు

ప్రస్తుతం సోషల్ మీడియాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, జబర్దస్త్ నూకరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, జ్యోతి, నందూస్ వరల్డ్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, చంద్రహాస్, కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణి తదితరుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై అధికారిక స్పష్టత లేదు.

ఈ సారైనా వస్తుందా… కావ్య శ్రీ?

బిగ్‌బాస్ తెలుగు-8 విజేత నిఖిల్ మలియక్కల్ మాజీ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న కావ్య శ్రీ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌లోనే ఆమెను తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రచారం ఉండగా, ఈసారి కూడా నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

అప్పుడేమో ప్రియుడు… ఇప్పుడేమో ప్రియురాలు!

కావ్య శ్రీ కోసం బిగ్‌బాస్ టీమ్ ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోందని, ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. ఎనిమిదో సీజన్‌లో నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలవగా, ఇప్పుడు ఆయన మాజీ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న కావ్య శ్రీ హౌస్‌లోకి వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే జరిగితే ‘అప్పుడేమో ప్రియుడు… ఇప్పుడేమో ప్రియురాలు’ అంటూ బిగ్‌బాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

13-07-26-GOLD RATE DOWN…