తుపాకులగూడెం చేరుకున్న మంత్రుల బృందం
సమక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్న ముగ్గురు మంత్రులకు ఘన స్వాగతం
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో చేరుకున్నారు.
మంత్రుల రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వస్సల్ టోప్పో పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అధికారులు మంత్రులకు ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
