దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహాకారం

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ నగరంలోని లక్ష్మి నగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై దేవాలయ ముఖద్వారం (టెంపుల్ ఆర్చ్) ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

దేవాలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన నిర్వాహకులు, కాలనీ వాసులను ఆయన అభినందించారు. దేవాలయ అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, తిరుమల వెంకటేష్, పెద్దగొల్ల నరసింహులు, కె.కిరణ్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు ఎస్.సత్యనారాయణ, పి.శంకర్, జి.సుదర్శన్ బాలకృష్ణ నాయకులు మైత్రి యాదయ్య, ఇమ్మడి పురుషోత్తం, గంజి ఆంజనేయులు, ప్రసాద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.