అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
డోంగ్లీ-1, మారేపల్లి కేంద్రాల్లో ఖాళీలు
డోంగ్లీ (ఆంధ్రప్రభ): ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా డోంగ్లీ మండలంలోని డోంగ్లీ-1, మారేపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టులకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫారాలు, అర్హతలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
విద్యార్హత, స్థానికత, వయోపరిమితి తదితర నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
