సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

తొర్రూరు ఆర్డీవో గణేష్

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా సమయపాలనతో పూర్తి చేయాలని తొర్రూర్ ఆర్డీవో గణేష్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో అధికారులకు,బిఎల్ ఓ లకు సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల వివరాల నమోదు సమయంలో పూర్తి కచ్చితత్వం పాటించాలని,ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేయాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు.అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తిచేసి డిజిటలీకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు,ఆర్ఐ శ్రావణ్ కుమార్,బిఎల్వోలు తదితరులు ఉన్నారు.