అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండాలి
జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యవర్గ సమావేశం..
విజయవాడ, ఆంధ్రప్రభ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై చర్చించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ ఎల్.చంద్రకళ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్వో డా. ఇందుమతి, జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ డాక్టర్ పి.మురళి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
