Police-Special-Drive : గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
Police-Special-Drive : గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
- నాయుడుపేట ;పోలీసులు స్పెషల్ డ్రైవ్
- మాదకద్రవ్యాలపై నిఘా ముమ్మరం
- అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
- గంజాయి విక్రయించినా సేవిం
- చినా కఠిన చర్యలే
- అర్భన్ సీఐ వెంకటేశ్వర్లు
(నాయుడుపేట, ఆంధ్రప్రభ)

Police-Special-Drive : నాయుడుపేట పట్టణంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అర్భన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బహిరంగ ప్రదేశాలు, నిర్మానుష్య ప్రాంతాలు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులకు కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, గంజాయి విక్రయించినా, సేవించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక ప్రజలు, మహిళలతో సమావేశమై గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో నాయుడుపేటను మాదకద్రవ్యాల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
