దస్తూరాబాద్ ఎంపీడీవోగా జావీద్ అలీ

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా సయ్యద్ జావీద్ అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నూతన ఎంపీడీవో సయ్యద్ జావీద్ అలీకి పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్ రెడ్డి, ఏపీఓ రవి ప్రసాద్, ఆపరేటర్ గణేష్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.