ప్రముఖ వైద్యులకు ఊర పండుగకు ఆత్మీయ ఆహ్వానం..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలో సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ (ఆదివారం) నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఊర పండుగ సందర్భంగా ప్రముఖ వైద్యులను నిర్వాహకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. భీమ్‌గల్‌కు చెందిన ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ అశోక్, డాక్టర్ రాంగిరి భాను ప్రకాష్ లను కలిసి పండుగ విశిష్టతను వివరించి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ సందర్భంగా వైద్యులు ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించి, ఊర పండుగ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని హామీ ఇచ్చారు. సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భీమ్‌గల్ ఊర పండుగ సామాజిక ఐక్యతకు, సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.