ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: బొడ్డు గంగన్న

కడెం, ఆంధ్రప్రభ: ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న పిలుపునిచ్చారు.

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు సోమవారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాదాసు రాజేశ్వర్, ఉపాధ్యక్షులుగా ఆరెళ్లి సుమన్, అతిక్, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ వహాబ్, కార్యదర్శులుగా బొల్లె రాజన్న, వహీద్, అధికార ప్రతినిధిగా తరి గంగాధర్, కోశాధికారిగా బుక్యా రమేష్, కార్యవర్గ సభ్యులుగా గొల్ల వెంకటేష్, తరి రమేష్, నేదూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఆ విశ్వాసాన్ని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నాయకత్వంలో ఖానాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ముస్కు రాజేందర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు సలీం, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముంజా ప్రసాద్ గౌడ్, నాయకులు తరి శంకర్, నారాయణ, ఆకుల లచ్చన్న, రాజేశ్వర్ రెడ్డి, గోసుకుల మల్లేష్, బొంగు గంగాధర్ గౌడ్, అన్వర్, రాజన్న, రమేష్, వెంకన్న, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.