మళ్లీ పల్నాడుకు బిందు మాధవ్.. ఎస్పీగా మరోసారి బాధ్యతలు!
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లాకు మళ్లీ బిందు మాధవ్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా గరికపాటి బిందు మాధవ్ ను పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించింది. 2017 బ్యాచ్‌కు చెందిన బిందు మాధవ్ గతంలో రంపచోడవరం ఏఎస్పీ, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్, సంయుక్త గుంటూరు జిల్లా సేబ్ జాయింట్ డైరెక్టర్, పల్నాడు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. 2024లో పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఎన్నికల సమయంలో సేవలందించారు. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీగా, ఆ తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తాజా బదిలీల్లో కాకినాడ జిల్లా నుంచి పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో మరోసారి పల్నాడు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే జిల్లాలో పనిచేసిన అనుభవం ఉండటంతో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అనుభవం జిల్లాకు ఉపయోగపడనుంధని భావిస్తున్నారు.
