క్యాతన్‌పల్లి 9వ వార్డులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్
క్యాతన్‌పల్లి 9వ వార్డులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి
అధికారులకు పరిష్కార చర్యలకు ఆదేశం
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. గద్దరాగడి శ్రీనివాస గార్డెన్ ఏరియా నుంచి మార్నింగ్ వాక్ ప్రారంభించిన మంత్రి, వార్డులోని పలు వీధుల్లో కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డులో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ప్రజలు చేసిన వినతులను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్, “ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజాప్రతినిధుల ప్రథమ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తాం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
