ఎస్ఐఆర్ సర్వేపై యువతకు సర్పంచ్ అవగాహన..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రామ్ నాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రాథోడ్ రాందాస్ ఆయన పంచాయతీ ప్రజలకు యువకులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎస్ ఐ ఆర్ ఓటర్ సర్వే నమోదు వివరాలపై స్వయంగా బోర్డుపై రాసి ఉపాధ్యాయుని లాగా అవగాహన కల్పించారు. ఎస్ ఐ ఆర్ సర్వే ఫారాల్లో ఏ విధంగా రాయాలి ఎలా రాయాలి అని చదువుకున్న యువకులకు బోర్డుపై సర్వేలోని మూడు అంశాలపై అవగాహన కల్పించినట్లు సర్పంచ్ రాథోడ్ రాందాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ నాయక్ తండ పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ సర్వేకు సహకరించి తమ పూర్తి వివరాలను సర్వే పారాల్లో పూర్తిచేసి బీఎల్ఓ లకు అందించాలని కోరారు. ఎస్ ఐ ఆర్ సర్వే ప్రాముఖ్యతపై ప్రజలకు యువకులకు అవగాహన కల్పించారు. చదువుకున్న యువకులు తమ తమ బంధువులకు సహకరించి ఎస్ఐ సర్వే పారాల ను నింపి సహకరించాలని సర్పంచ్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సర్వే పారాలింపి ఇవ్వాలని ఒక్కరు కూడా కోర్టు హక్కుకు మిస్ కావద్దని సర్పంచ్ కోరారు. ఈ అవగాహన సమావేశంలో ప్రజలు యువకులు పాల్గొన్నారు.
