గ్రామ కమిటీలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని నర్సాపూర్, దిల్దార్‌నగర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న తెలిపారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొత్తూరి పెద్దులు, దిల్దార్‌నగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కుందూరి చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నర్సాపూర్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులుగా పెంద్రం భీమన్న, గుగ్లాత్ ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా చెన్నూరి నర్సయ్య, కార్యదర్శులుగా బుక్యా పవన్ కళ్యాణ్, కలమడుగు లింగన్న, అధికార ప్రతినిధిగా సోగుల శంకర్, కోశాధికారిగా పెంద్రం సుంగు, సభ్యులుగా కోలరాజు, ఎల్లయ్య ఎన్నికయ్యారు.
దిల్దార్‌నగర్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులుగా జక్కుల రాజేంద్ర, శనిగారపు నరేష్, ప్రధాన కార్యదర్శిగా శోభన్, కార్యదర్శులుగా తాటిపెల్లి గంగరాజం, సుంగే రాహుల్, అధికార ప్రతినిధిగా కుందూరి నితిన్, కోశాధికారిగా ఆదర్శ్, సభ్యులుగా జక్కుల మహేంద్ర, ప్రశాంత్, పద్మ, వనిత ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత రాజేష్, ఉప సర్పంచ్ జంగం రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముస్కు రాజేందర్, రాహుల్ గాంధీ తెలంగాణ ఫాలోవర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శనిగారపు కమలాకర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు సలీమ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముంజా ప్రసాద్ గౌడ్, మండల కార్యదర్శి బాలే నరేష్, నాయకులు దుల్ల వెంకటేష్, జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
