ADB | రేంజు ఆఫీసరుతో పాటు ముగ్గురుపై కేసు నమోదు
జన్నారం, (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్‌పూర్ అటవీ చెక్‌పోస్టు వద్ద.. జన్నారంకు చెందిన మోబీన్‌ను కొట్టిన మంచిర్యాల ఫ్లయింగ్ స్వాడ్ రేంజ్ అధికారిణి రమాదేవి, ఫారెస్ట్ బీట్ అధికారి రవి, డ్రైవర్ పోత్సన్నపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.
గత నెల 28 రాత్రి త్రి సమయంలో జన్నారంకు చెందిన మోబిన్ తన స్నేహితులతో కలిసి లక్షేటిపేట వైపు వెళ్తుండగా… చెక్ పోస్ట్ వద్ద ఉన్న రేంజ్ ఆఫీసర్, బీట్ అధికారి, డ్రైవర్లు.. మొబైల్ సెల్ ఫోన్ తీసుకెళ్లి దుర్భాషలాడారని మోబిన్ ఫిర్యాదు చేశాడు.
మోబిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు. అలాగే మంచిర్యాల ప్లైయింగ్ స్కాడ్ ఫారెస్ట్ బీట్ అధికారి రవి ఫిర్యాదు మేరకు మోబిన్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.